పగలూ-రాత్రి, చిన్నా-పెద్దా, అక్కా-చెల్లి, తల్లీ-పిల్ల అనే తేడా లేకుండా ఆడది కనిపిస్తే చాలు అరాచకాని(woman was raped and killed)కి పాల్పడుతున్నారు కొందరు కామాంధులు. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి నుంచి.. కాటికి కాలు చాచిన ముసలివాళ్ల వరకూ ఎవరినీ వదలట్లేదు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు(woman was raped and killed) రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కీచకులపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా చట్టం తమకు చుట్టం అన్నట్లు కామాంధుల ఆగడాలకు అడ్డుపడటం లేదు.
తాజాగా... ఓ వివాహితపై ఇద్దరు అత్యాచారాని(woman was raped and killed)కి పాల్పడి.. ఆపై ఆమె తల నేలకేసి కొట్టి హతమార్చిన పైశాచికం బుధవారం తెలంగాణలోని నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. నిందితులిద్దరిలో ఒకరు.. భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు. మరోవ్యక్తి.. భార్యతో గొడవపడి ఒంటరిగా ఉంటున్నాడు.
నల్గొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత (54) భర్తతో కలిసి గ్రామంలోనే కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారికి వివాహమైంది. ఆమె బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి దుకాణానికి నడుచుకుంటూ వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన బక్కతట్ల లింగయ్య, అతడి స్నేహితుడు కుమ్మరి పుల్లయ్య అటకాయించారు. నోరు మూసి లింగయ్య ఇంట్లోకి లాక్కెళ్లారు. వివస్త్రను చేశారు. దాడి చేసి అత్యాచారాని(woman was raped and killed)కి పాల్పడ్డారు. అనంతరం తలను నేలకేసి కొట్టి.. పిడిగుద్దులు గుద్ది ఆమెను హతమార్చారు. మెడలోని బంగారు గొలుసు, గాజులు, చెవి కమ్మలు తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు.
గొడవ జరుగుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు అక్కడికి వచ్చి వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితులిద్దరూ 40 ఏళ్ల లోపు వారు. వినాయక నిమజ్జనం జరిగిన ఆదివారం నుంచి మద్యం తాగి గ్రామంలో జులాయిగా తిరుగుతున్నారని పోలీసులకు గ్రామస్థులు తెలిపారు. రెండేళ్ల నుంచి కాపురంలో గొడవలు రావడంతో లింగయ్య భార్య కొంత కాలంగా పుట్టింట్లో ఉంటున్నారు. కుమ్మరి పుల్లయ్య.. భార్యను ఏడేళ్ల క్రితం హత్య చేసి నెల రోజుల పాటు జైలుకు వెళ్లి వచ్చాడు.