Suicide Attempt: గుంటూరులో మహిళ ఆత్మహత్యాయత్నం.. ఏమైంది..? - latest crime news in guntur
12:17 March 28
పురుగుల మందు తాగిన మహిళ, జీజీహెచ్‌కు తరలింపు
Suicide Attempt: గుంటూరు గ్రామీణ ఎస్పీ కార్యాలయంలోని స్పందన కార్యక్రమంలో ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. దుర్గికి చెందిన రాజేశ్వరి అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్తి వివాదాలే ఆత్మహత్యాయత్నానికి కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించే క్రమంలో పురుగుల మందు వాసన పీల్చి ఓ మహిళా కానిస్టేబుల్ స్పృహ తప్పి పడిపోయింది.
ఇదీ చదవండి: Dola On DSC: టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా.. ఎస్జీటీ పోస్టుల రద్దు దారుణం: తెదేపా ఎమ్మెల్యే డోలా