SLAP: సోషల్ మీడియాలో పరిచయాలను నమ్మి మోసపోవద్దని పోలీసులు ఎంత అవగాహన కల్పించినా.. చాలా మంది మోసపోతూనే ఉన్నారు. ఇక్కడ కూడా ఇలానే జరిగింది. కాకపోతే సోషల్ మీడియాలో పరిచయం తర్వాత కలిసి మాట్లాడుకున్నారు.. కలిసి తిరిగారు కూడా. ఉద్యోగం కోసం కోచింగ్‌కు వెళ్తానంటే నమ్మి దాదాపు రూ.4లక్షల వరకు ఇచ్చింది. అలా సాగుతుండగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇంకేముంది సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వరకు వెళ్లింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆలూరులో జరిగింది.
సోషల్ మీడియాలో పరిచయం.. కలిసి తిరగడం.. కట్‌చేస్తే చెప్పుదెబ్బ!! - కర్నూలు జిల్లా తాజా వార్తలు
SLAP: కర్నూలుకు చెందిన వ్యక్తికి పశ్చిమ గోదావరికి చెందిన మహిళా ఉద్యోగికి సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల పాటు సాగిన ఈ పరిచయంలో కలిసి తిరిగారు, మాట్లాడుకున్నారు. అలా సాగుతున్న సమయంలో ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. అది కాస్తా ముదిరి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వరకు వెళ్లింది. కట్ చేస్తే సదరు మహిళ ఆలూరులో ప్రత్యక్షమైంది. అయితే ఎవరూ ఊహించని విధంగా పోలీస్‌స్టేషన్ ఎదుట చెప్పుతో ఇరగ బాదింది. ఇందులో ఇంకో ట్విస్ట్ ఉంది. అది ఏంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చూడాల్సిందే.

అసలేం జరిగిందంటే..?
కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన శానవాజ్ అనే వ్యక్తికి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తోన్న ఓ మహిళా ఉద్యోగితో సోషల్‌మీడియాలో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య స్నేహం చిగురించి, కలిసి తిరగడం వరకూ వెళ్లింది. ఏమైందో తెలియదు కానీ కొన్నాళ్లకు ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఆమెతో వివాదం మొదలు కావటంతో ఆ మహిళ ఫొటోలను అసభ్యకరంగా మార్చి సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో పెట్టాడు. దీంతో ఆగ్రహించిన సదరు మహిళ నేరుగా ఆలూరుకు వచ్చి, పోలీస్‌స్టేషన్ ఎదుటే అతడిని నిలదీసింది.. ఎంతకీ సమాధానం చెప్పకపోవడంతో చెప్పుతో కొట్టింది. తర్వాత అతడిపైనా, అతడి భార్యపైనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండి: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల