WOMAN DIED : గత రెండురోజులుగా ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని దర్శి పట్టణంలోని పడమటి బజారులో ఓ మట్టిమిద్దె కూలి తుపాకుల కాశమ్మ అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దర్శి పట్టణం పడమటి బజారుకు చెందిన తుపాకుల వెంకటరావు భార్య కాశమ్మ.. ఆమె తల్లి చనిపోయినప్పటి నుంచి వాళ్ల అమ్మ జ్ఞాపకంగా ఉన్న మట్టిమిద్దెలోనే ఉంటుంది. అప్పటికే కురుస్తున్న వర్షాలకు మట్టిమిద్దె నాని ఉండడం వల్ల.. అర్ధరాత్రి సమయంలో పై కప్పు కూలింది. ఉదయం తన కుమార్తె వచ్చి తల్లి కనపడటం లేదని చుట్టుపక్కల వారికి చెప్పడంతో.. కూలిన ఇంటిని పరిశీలించగా శవమై కనిపించింది.
భారీ వర్షాలతో మట్టిమిద్దె కూలి మహిళ మృతి.. ఆలస్యంగా వెలుగులోకి - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
WOMAN DIED IN DARSI : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల గోడలు, మిద్దెలు కూలి ప్రజలు తీవ్రగాయాలపాలవుతున్న ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో మట్టిమిద్దె కూలి మహిళ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
![భారీ వర్షాలతో మట్టిమిద్దె కూలి మహిళ మృతి.. ఆలస్యంగా వెలుగులోకి WOMAN DIED IN DARSI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16577978-254-16577978-1665134211986.jpg)
WOMAN DIED IN DARSI