ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం అంబటిపూడి గ్రామానికి చెందిన గంగవరపు చిన్న పాపారావు(61), రమాదేవి (57) భార్యాభర్తలు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిద్దరికీ పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఇన్నాళ్లూ సంతోషంగా సాగిన వీరిన కాపురంలో.. భర్త అనారోగ్యం సమస్యలను తెచ్చిపెట్టింది. గత కొంతకాలంగా పాపారావు ఆరోగ్యం బాగాలేదు. మామూలే జ్వరమే కావచ్చని భావించారా దంపతులు. పది రోజుల క్రితమే గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం గణపవరంలోని కుమార్తె ఇంటికి వెళ్లారు.
COUPLE DEATH: అనారోగ్యంతో భర్త.. విషయం తెలిసి భార్య మృతి - అనారోగ్యంతో భర్త.. విషయం తెలిసి భార్య మృతి
కట్టుకున్న వాడికి కలకాలం తోడుంటానని చెప్పింది. ఆయన ఏం చేసినా.. ఎక్కడికెళ్లినా వెంటే ఉంటూ అండగా నిలిచింది. చివరకు ఆయన చావులో కూడా తాను తోడుంటానని ఆయన వెంటే వెళ్లిపోయింది. అనారోగ్యంతో భర్త మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న ఆమె... గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. చూస్తుండగానే ప్రాణాలు విడిచింది.
ఈరోజు ఉదయం చిన్నపాపా రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విషయం గుర్తించిన కుమార్తె, అల్లుడు... అతడిని గుంటూరుకు తీసుకెళ్లారు. కానీ పాపారావు మార్గమధ్యంలోనే మృతి చెందాడు. తండ్రి చనిపోయాడన్న వార్తను కుమార్తె... తల్లికి ఫోన్ చేసి చెప్పింది. తట్టుకోలేని రమాదేవి గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమె స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ రమాదేవి మృతి చెందింది. రెండు గంటల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో గ్రామస్థులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చూడండి:DASARA HOLLYDAYS: 11 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు