WIFE KILLED HUSBAND: పప్పు కోసం గొడవ..కత్తి గుచ్చుకొని భర్త మృతి - విజయనగరం క్రైమ్ వార్తలు
![WIFE KILLED HUSBAND: పప్పు కోసం గొడవ..కత్తి గుచ్చుకొని భర్త మృతి husband died at vijayangaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12416874-962-12416874-1625992516288.jpg)
16:57 July 10
కత్తి గుచ్చుకొని భర్త మృతి
పప్పు కోసం గొడవ మనిషి ప్రాణం పోయేలా చేసింది. దీనికి సంబంధించిన వివరాలను విజయనగరం పోలీసులు వెల్లడించారు. వంట మనిషిగా పనిచేస్తున్న ఆర్.శ్రీనుకు, రూపావతికి 22 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. వీరిలో ఒకరికి వివాహమైంది. వీరు విజయనగరంలోని లంకవీధిలోని పూరిగుడిసెలో ఉంటున్నారు. శ్రీను రోజూ తాగొచ్చి భార్యతో గొడవ పడేవాడు. శనివారం భార్య వంకాయ కూరతో భర్తకు భోజనం పెట్టింది. ఆ కూర వద్దని.. పప్పు వండమని చెప్పాను కదా అన్నాడు. సరే పప్పు చేస్తానని ఆమె వంట ప్రారంభించబోయారు.
ఇంతలో ఆమె వద్దకు వెళ్లి శ్రీను గొడవ పడి కిందపడ్డాడు. అక్కడే కూరగాయలు కోసే కత్తి వీపునకు గుచ్చుకుని రక్తస్రావమైంది. వెంటనే కేంద్రాసుపత్రికి చికిత్సకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనా స్థలాన్ని సీఐ లక్ష్మణరావు, ఎస్‌ఐ బాలాజీరావు పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తామని ఎస్‌ఐ బాలాజీరావు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: