ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

చున్నీతో భర్తను చంపిన భార్య - chandrayangutta crime news

భార్య, భర్తలు ఇద్దరు మద్యానికి బానిసయ్యారు. ఆ క్రమంలో పలు సార్లు గొడవలు సైతం జరిగాయి. కానీ తాజాగా సోమవారం రాత్రి వారిద్దరి మధ్య జరిగిన ఘర్షణ చంపుకునే స్థాయికి వెళ్లింది. ఈ తరుణంలో భర్తను భార్య చున్నీతో హతమార్చింది. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పరిధిలో జరిగింది.

wife-killed
wife-killed

By

Published : Mar 2, 2021, 2:01 PM IST

భార్య చేతిలో భర్త హత్యకు గురైన ఘటన హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పుట్ పాత్ మీద ఉంటూ భిక్షాటన చేసుకునే దంపతులు మద్యానికి బానిసయ్యారు. పలు మార్లు మద్యం మత్తులో ఇద్దరి మధ్య ఘర్షణలు జరిగేవి.

సోమవారం రాత్రి చాంద్రాయణగుట్ట చమన్ వద్ద మద్యం మత్తులో ఉన్న భార్య, భర్త మెడకు చున్నీని బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చింది. అనంతరం ముఖంపై ప్లాస్టిక్ పెట్టి కల్చడానికి ప్రయత్నించింది.

సమాచారం తెలుసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్య భర్తలు ఇద్దరు వైట్​నర్​ను తీసుకుని మత్తులో ఉండేవారని తెలిసింది.


ఇదీ చూడండి :రైతు వద్ద నుంచి రూ.6.04 లక్షలు లాక్కెళ్లిన దొంగలు

ABOUT THE AUTHOR

...view details