తనను కులం పేరుతో దూషిస్తూ తీవ్రంగా కొడుతూ అర్ధ నగ్నంగా ఉండమంటాడని, మూత్రం తాగాలని బలవంతం చేస్తాడని ఓ మహిళ తన భర్త ఆగడాలపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. అతని కుటుంబ సభ్యులూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులు చెప్పిన వివరాలిలా...
తెలంగాణలోని నారాయణపేట మక్తల్‌కు చెందిన మహిళ రహమత్‌నగర్‌లో నివసిస్తున్నారు. ఆమెకు 2016లో ఓ యువకుడితో ప్రేమ వివాహమైంది. గర్భం దాల్చినా గర్భస్రావం చేయించారు. 2020లో భర్త సోదరుడు, సోదరి, బావ ఆమెను కులం పేరుతో దూషించేవారు. పలుమార్లు పెట్రోల్ పోసి చంపేస్తానంటూ బెదిరింపులకు దిగేవారు. భర్తకు రూ.1.50 లక్షలు ఇచ్చింది. ఆతర్వాత కూడా వేధింపులు ఆపలేదు. అర్ధనగ్నంగా కూర్చోవాలని, మూత్రం తాగాలని బలవంతం చేసేవాడు. ఈ మేరకు నిందితులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
ఇదీ చూడండి:BOY DEATH : అప్పటి దాకా ఆడాడు..కోనేటిలో స్నానం చేద్దామనుకున్నాడు...అంతలోనే...