ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

MINOR: మైనర్​ పట్ల అసభ్య ప్రవర్తన.. వాలంటీర్ అరెస్ట్..! - గుంటూరు జిల్లా తాజా వార్తలు

MINOR: మహిళలపై దాడులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. మానవత్వం అనేది మరచి మృగాల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్ల అయితే చాలు వయసుతో సంబంధం లేకుండా అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా మైనర్ బాలిక పట్ల ఓ వాలంటీర్​ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

indecent behavior
indecent behavior

By

Published : May 20, 2022, 7:08 AM IST

MINOR: గుంటూరు జిల్లాలో మహిళలు, బాలికపై అత్యాచారాలు, అసభ్యకర ప్రవర్తనలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా పెదనందిపాడు మండలంలోని పుసులూరు గ్రామంలో ఓ మైనర్ బాలిక పట్ల ఆనంద్ బాబు అనే వాలంటీర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు... వాలంటీర్​ను అరెస్ట్ చేశారు. నిందితుడిని పోలీసులు కోర్టుకు తరలించే సమయంలో వాలంటీర్​ తల్లి స్టేషన్ బయట సొమ్మసిల్లి పడిపోయింది.

ABOUT THE AUTHOR

...view details