అవమానం భరించలేక వీవోఏ ఆత్మహత్యకు యత్నించిన ఘటన తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన వీవోఏ రమేష్.. తమ శాఖకు చెందిన వాట్సప్ గ్రూప్లో మహిళా సీసీని తప్పుగా ఏదో రాశారని అనడంతో వివాదం మొదలైంది. దీంతో గ్రూప్లో చర్చ జరిగింది. మరుసటి రోజు జిల్లా కేంద్రంలోని ఓ బ్యాంకులో ఉన్న రమేష్ వద్దకు సీసీ వెళ్లి చెంపపై కొట్టిందని వీవోఏలు, కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
కొట్టిన మాట వాస్తవమే..
ఆందోళన స్థలికి చేరుకున్న సీసీ.. రమేష్ ఆయనకు సంబంధం లేని విషయంలో అనవసరంగా తలదూర్చి తనను ఇబ్బంది పెట్టాడని ఆరోపించారు. అందుకే చెప్పుతో కొట్టానని తెలిపారు.