ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

CASE విశాఖలో గల్లంతైన సాయిప్రియపై కేసు నమోదు, ఆమె ప్రియుడుపై కూడా - ఏపీ తాజా వార్తలు

CASE FILE ON SAI PRIYA విశాఖ బీచ్​లో గల్లంతై, నెల్లూరులో ప్రత్యక్షమైన సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ధనం, సమయం వృథా చేసినందుకు కేసు నమోదు చేశారు.

CASE FILE ON SAI PRIYA
CASE FILE ON SAI PRIYA

By

Published : Aug 28, 2022, 10:34 PM IST

CASE FILE ON SAI PRIYA విశాఖ బీచ్​లో గల్లంతై.. నెల్లూరులో ప్రత్యక్షమైన సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ధనం, సమయం వృథా చేసినందుకు గాను, కోర్టు అనుమతితో కేసు నమోదు చేశారు.

ఏం జరిగిందంటే..:విశాఖకు చెందిన సాయిప్రియకు, శ్రీనివాసరావుతో రెండేళ్ల క్రితం పెళ్లయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న శ్రీనివాసరావు.. రెండో పెళ్లి రోజు జరుపుకునేందుకు పుట్టింట్లో ఉన్న సాయిప్రియ వద్దకు వచ్చాడు. సోమవారం సాయంత్రం (ఈనెల 25న) భార్యాభర్తలు సరదాగా ఆర్కే బీచ్​లో గడిపారు. ఇంటికి వెళ్దామనుకున్న సమయంలో సముద్రంలో కాళ్లు కడుక్కుని వస్తానని చెప్పిన సాయిప్రియ మళ్లీ భర్తకు కానరాలేదు. ఆమె సముద్రంలో గల్లంతై ఉంటుందని భావించిన శ్రీనివాసరావు అత్తమామలకు సమాచారమిచ్చాడు.

విశాఖ డిప్యూటీ మేయర్ జియ్యాన శ్రీధర్ వార్డులోనే సాయిప్రియ తల్లిదండ్రులు ఉండడం వల్ల ఆయన ద్వారా పోలీసులకు తెలియజేశారు. కోస్ట్ గార్డు సహాయంతో గాలింపు చర్యలు కొనసాగించారు. ఒక హెలికాప్టర్, రెండు భారీ టగ్‌ల సహాయంతో తీరం వెంట.. సముద్ర జలాల్లోనూ గాలింపు చేపట్టారు. మూడో పట్టణ పోలీసులు సాగర తీరం వెంబడి ఉన్న నిఘా కెమెరాల రికార్డులను నిశితంగా పరిశీలించారు. ఎక్కడా మహిళ మునిగిపోతున్న దృశ్యాలు నమోదు కాలేదు. చివరకు సాయిప్రియ కాల్‌ డేటా ఆధారంగా విచారణ సాగించడంతో.. ఆమె నెల్లూరులో బంధువులింట ఉందని తెలిసింది.

ఆ తర్వాత ఆమె బెంగళూరు నుంచి తల్లిదండ్రులకు వాట్సప్​ మెసెజ్​ చేసింది. తాను క్షేమంగా ఉన్నానని.. రవితో ఇష్టపూర్వకంగా వెళ్లినట్లు తెలిపింది. తన ఫొటోను పంపిన ఆమె.. తాళిబొట్టుతో కనిపించింది.సాయిప్రియను వెదికేందుకు పోలీసులు, గజ ఈతగాళ్లు, కోస్ట్ గార్డు బోట్లు, హెలికాప్టర్లతో ఎంతో శ్రమించారు. ఒక టగ్ ఒక గంట సేపు గాలించాలంటే వందల లీటర్ల డీజిల్ వాడాలి. హెలికాప్టర్ గాలిలో గంట సేపు సముద్ర తీరం వెంబడి గాలించాలంటే భారీగానే ఖర్చు పెట్టాలి. సాయిప్రియ కోసం దాదాపు 10 గంటల పాటు రెండు టగ్ బోట్లు, ఒక హెలికాప్టర్ గాలింపులో పాల్గొన్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details