MURDER: విశాఖ ఎంవీపీ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రూ.500 వ్యవహారంలో అప్పలరెడ్డి అలియాస్ అప్పన్న రెడ్డి అనే వ్యక్తిని రౌడీషీటర్ శంకర్ మరో వ్యక్తితో కలిసి కత్తితో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. పెదవాల్తేర్ మునసబు వీధిలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పు తిరిగి ఇవ్వాలని అప్పలరెడ్డి అడిగితే.. దాడికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
విశాఖలో దారుణం.. తీసుకున్న రూ.500 తిరిగి అడిగినందుకు - విశాఖలో వ్యక్తి దారుణ హత్య
07:49 July 23
మద్యం కోసం చేసిన అప్పు తిరిగి ఇవ్వాలని అడిగితే దాడి
రాత్రి డబ్బులు ఇచ్చేందుకు బైక్‌పై వచ్చిన రౌడీషీటర్ శంకర్.. అప్పలరెడ్డి గొంతు కోసి పరారయ్యారు. మృతుడు కారు డ్రైవర్‌గా పని చేస్తూ.. రాత్రి పూట మద్యం విక్రయిస్తాడని సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. హత్య చేసిన నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ.. మృతుడి బంధువులు, సన్నిహితులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వారిని నిలువరించేందుకు భారీగా పోలీసులు మోహరించారు.
కేవలం రూ.500 కోసమే గౌరీ శంకర్ హత్య చేసినట్లు ద్వారకా ఏసీపీ మూర్తి తెలిపారు. సాయి అనే వ్యక్తి సహకారంతో హత్య చేసినట్లు గుర్తించామని.. మరొకరు పరారీలో ఉన్నట్లు వివరించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవీ చదవండి: