ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

MAN HARRASING GIRLS: యువకుడి వెకిలి చేష్టలు.. గ్రామస్థులు ఏం చేశారంటే..! - ఏపీ 2021 వార్తలు

యాభై ఇస్తావా.. వందిస్తావా.. ముద్దిస్తావా.. నాతో వస్తావా అంటూ ఊళ్లోని విద్యార్థినులను ఏడిపించాడో వ్యక్తి. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆ యువకుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

villagers-beating-youngman-who-harrased-girl-students-at-srikakulam
యాభై ఇస్తావా.. వందిస్తావా.. ముద్దిస్తావా.. నాతో వస్తావా?

By

Published : Nov 9, 2021, 11:43 AM IST

Updated : Nov 9, 2021, 1:07 PM IST

శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం గేదెలపేటలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. నిందితుడిది తమ గ్రామం కాకపోయినప్పటికీ.. తరచుగా తమ ఊరికి వస్తూ బాలికలతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడని గ్రామస్థులు చెబుతున్నారు. గత పది రోజులుగా పాఠశాలకు వెళ్లే దారిలో ఉంటూ.. యాభై ఇస్తావా.. వందిస్తావా.. ముద్దిస్తావా.. నాతో వస్తావా అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వివరించారు.

యువకుడి వెకిలి చేష్టలు.. గ్రామస్థులు ఏం చేశారంటే..!

విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. నిందితుడిని రామాలయంలోని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితుడు శ్రీకాకుళం పట్టణానికి చెందిన పి. శ్రీనివాసరావుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు శ్రీనివాసరావు రాజాం నగరపాలక సంస్థలోని నీటి సరఫరా విభాగంలో తాత్కాలిక ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Last Updated : Nov 9, 2021, 1:07 PM IST

ABOUT THE AUTHOR

...view details