వడ్డీ వ్యాపారుల వేధింపులతో విజయవాడలో నిజామాబాద్‌కు చెందిన సురేష్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. జ్ఞానేశ్వర్, చంద్రశేఖర్, వినీతలను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. పప్పుల సురేష్ కుటుంబం.. ఆత్మహత్యకు ముందు తీవ్ర ఒత్తిడికి గురైందని పోలీసులు చెప్పారు. సీసీటీవీ దృశ్యాల ద్వారా దీన్ని గుర్తించినట్లు తెలిపారు. వసతి గృహం లోపల చనిపోయిన భార్య శ్రీలత, ఆశీష్లను గదిలో వదిలి వెళ్లి.. సురేష్, అతని కుమారుడు అఖిల్ నదిలో దూకి సూసైడ్ చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లే ముందు వారున్న గదిలోకి, బయటకు రెండు సార్లు తిరిగినట్లు సీసీటీవీల్లో రికార్డు అయింది.
ఈనెల 8న సూసైడ్..
ఏపీలోని విజయవాడలో.. నిజామాబాద్‌కు చెందిన సురేష్ కుటుంబం ఆత్మహత్య చేసుకొంది. కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లి, కుమారుడు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు. తండ్రి, మరో కుమారుడు కృష్ణానదిలో దూకారు. విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాహ్మణ విధిలో శ్రీ కన్యకాపరమేశ్వరి సత్రంలోని 3వ ఫ్లోర్‌లో ఈనెల 6వ తేదీన వీరు.. పప్పుల అఖిల్ పేరిట వీరు ఒక గది తీసుకున్నారు. ఈనెల 8న ఉదయం 6 గంటలకు నిజామాబాద్ నుంచి శ్రీ రామప్రసాద్ అనే వ్యక్తి సత్రానికి ఫోన్ చేసి తన బావ సురేశ్ అప్పుల బాధతో చనిపోతున్నట్లు సమాచారం అందించారు. రాత్రి రెండున్నర గంటలకు తన బావ వద్ద నుంచి ఈ మేరకు వాయిస్ మెసెజ్‌లు వచ్చాయని తెలిపాడు. దీంతో సత్రం సిబ్బంది సురేశ్ కుటుంబం ఉన్న గదికి వెళ్లి చూడగా... అప్పటికే ఇద్దరు చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతులు పప్పుల సురేష్(56), పప్పుల శ్రీలత కాగా...వారి కుమారులు 28 ఏళ్ల అఖిల్, 22 ఏళ్ల ఆశిష్‌గా గుర్తించారు.
సెల్ఫీ వీడియో వైరల్..