Vanama Raghava judicial custody: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవను.. తెలంగాణలోని కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. విచారణ అనంతరం రాఘవకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. దీంతో.. వనమా రాఘవను భద్రాచలం సబ్ జైలుకు పోలీసులు తరలించారు.
Palvancha suicide case: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన రామకృష్ణను.. తాను బెదిరించినట్టు వనమా రాఘవ విచారణలో ఒప్పుకున్నాడని ఏఎస్పీ రోహిత్ తెలిపిన విషయం తెలిసిందే. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య, వనమా రాఘవ కేసుకు సంబంధించి మీడియా సమావేశంలో మాట్లాడిన ఏఎస్పీ.. వనమా రాఘవపై ఈ కేసుతోపాటు మరో 12 కేసులు ఉన్నాయని స్పష్టం చేశారు.