"కామా తురాణాం న జాతి న భేదం" అన్నట్టు తయారయ్యారు కొందరు కామాంధులు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఆడవాళ్లపై కొంత మంది కామపిశాచులు అఘాయిత్యాలకు ఎగబడుతోంటే.. మానవ జాతినే కాకుండా మూగజీవాలపైనా పడి వాళ్ల పశు వాంఛ తీర్చుకుంటున్నారు. తాజాగా.. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం విజయ కాలనీలో ఈ ఘోరం జరిగింది.
కాలనీకి చెందిన రమేశ్ అనే వ్యక్తి.. శనివారం రాత్రి పూట పీకల దాకా తాగాడు. మద్యం మత్తులో కామంతో కళ్లు మూసుకుపోయిన ప్రబుధ్దుడు.. తన లైంగిక వాంఛ తీర్చుకునేందుకు గేదేను ఎంచుకున్నాడు. మూగజీవంపై లైంగిక కార్యకలాపాలు కొనసాగించాడు. అటుగా వచ్చిన స్థానికులు గమనించి.. వెంటనే రమేశ్‌ను పట్టుకున్నారు. అందరూ చేరి రమేశ్‌ను చితకబాదారు. తాళ్లతో కట్టేసి.. పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో నిర్బంధించారు.