విశాఖ జిల్లా రోలుగుంట మండలం అడ్డసరం శివారు దెబ్బల పాలెం సమీపంలో గంజాయి లోడు చేసిన వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి పరారయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రోలుగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. AP 31 CG 9997 నెంబర్ గల వాహనంలో సుమారు 50 లక్షల రూపాయల విలువ చేసే 560 కిలోల గంజాయిని కారులో నింపి గ్రామ సమీపంలో వదిలి నిందితులు పరారైనట్లు ఎస్సై నాగ కార్తీక్ తెలిపారు.
ఈ గంజాయిని విశాఖ మన్యంలో కొనుగోలు చేసి రహస్య మార్గాల మీదుగా తరలించే ప్రయత్నంలో రహదారి మరిచి వాహనాన్ని నిలిపి వేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కారులో లభ్యమైన కాగితాల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.