woman Suicide at Prakasam: ఇద్దరు పిల్లలతో సహా గుర్తుతెలియని మహిళ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా చినగంజాంలో జరిగింది. సోపిరాల రైల్వేగేటు సమీపంలో అందరూ చూస్తుండగానే ఒంగోలు నుండి చీరాల వైపు వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలు కింద పడి.. ఆత్మహత్య చేసుకుంది.
మహిళ శరీరం పూర్తిగా చిద్రమైపోయింది. పిల్లల ఇద్దరి వయస్సు ఆరు సంవత్సరాలలోపే ఉంటుందని స్థానికులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.