Kavali: నెల్లూరు జిల్లా కావలి పట్టణ శివారు ప్రాంతం వెంకయ్యగారిపాలెంలో ఉన్న ఓ ప్రైవేట్ లేఔట్లో ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు సజీవ దహనం చేశారు. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ దేవరకొండ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఉదయం కల్లు గీయడానికి వచ్చిన కార్మికుడు మహిళను సజీవ దహనం చేశారనే సమాచారం ఇచ్చారని తెలిపారు. సుమారు 35 సంవత్సరాల వయస్సు గల మహిళను ఎక్కడో చంపి ఇక్కడ దహనం చేసినట్టుగా అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేస్తామని తెలియజేశారు.
Kavali: నెల్లూరు జిల్లా కావలిలో గుర్తు తెలియని మహిళ సజీవ దహనం..ఎవరామె..? - కావలి తాజా వార్తలు
Kavali: కావలి శివారు ప్రాంతంలో తెల్లవారుజామున దారుణమైన ఘటన చోటు చేసుకుంది. జాతీయ రహదారికి పక్కన ఓ ప్రైవేట్ లేఅవుట్లో సుమారు 35 సంవత్సరాలు కలిగిన మహిళను గుర్తు తెలియని దుండగులు సజీవ దహనం చేశారు.
నెల్లూరు జిల్లా కావలిలో గుర్తు తెలియని మహిళ సజీవ దహనం