GOLD ROBBERY: విశాఖ నగరంలో భారీ దోపిడీ జరిగింది. ఓ వ్యాపారి బంగారాన్ని తనఖా పెడుతున్న సమయంలో.. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వారిని కొట్టి బంగారాన్ని దొంగిలించారు. సుమారు 800గ్రాముల బంగారాన్ని దొంగిలించారని పోలీసులు తెలిపారు. విశాఖ షీలానగర్‌కు చెందిన ప్రసాద్ తనకు పరిచయం ఉన్న గోల్డ్‌లోన్ కంపెనీ ఏజెంట్ రాజునాయుడు వద్ద బంగారం తనఖా పెట్టాలనుకున్నారు. రాజునాయుడు తనకు తెలిసిన ఆనంద్ అనే ఫైనాన్షియర్ వద్ద సుమారు 35 లక్షలు తీసుకుని బుధవారం ఉదయం 10గంటల30నిమిషాల సమయంలో ప్రసాద్ దుకాణానికి వెళ్లారు. ప్రసాద్.... బంగారాన్ని రాజునాయుడు ముందు పెట్టడంతో.. తన వద్ద వున్న 35 లక్షలను అందజేశాడు. ప్రసాద్ ఆ డబ్బును వెంటనే వేరొకరి ద్వారా ఎక్కడికో పంపించారు. అనంతరం రాజునాయుడు బంగారం తీసుకువెళ్లేందుకు బ్యాగ్‌లో సర్దుకుంటుండగా షాప్ వెనుక ద్వారం నుంచి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు లోపలకు ప్రవేశించారు. రాజునాయుడుతోపాటు ప్రసాద్‌ను బంధించి.. బంగారం తీసుకుని పరారయ్యారు. అనంతరం.. రాజునాయుడు తనకు డబ్బులు సర్దుబాబు చేసిన ఆనంద్‌కు విషయం చెప్పడంతో... వారిద్దరూ కలిసి నాలుగోటౌన్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని.. దర్యాప్తు పూర్తిచేసిన తర్వాత ఉన్నతాధికారులకు నివేదించి వివరాలను వెల్లడిస్తామన్నారు.
GOLD ROBBERY: బంగారం తనఖా పెడుతుండగా చోరీ.. ఎక్కడంటే? - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
GOLD ROBBERY: ఒక అతనికి డబ్బులు అవసరం ఉండటంతో బంగారం తనఖా పెట్టాలనుకున్నాడు. తనకు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి డబ్బులు అడిగాడు. ఆ వ్యక్తి తనకు తెలిసిన వేరే వారి దగ్గర నుంచి సుమారు 35 లక్షల రూపాయలు తీసుకుని మొదటి వ్యక్తి చెప్పిన ప్రదేశానికి వెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత వారిద్దరూ బంగారం, డబ్బులు మార్చుకున్నారు. డబ్బులు తీసుకున్న వ్యక్తి వేరొకరికి ఇచ్చి పంపించాడు. ఇంకో వ్యక్తి బంగారాన్ని బ్యాగులో పెట్టుకుంటున్న సమయంలో సరిగ్గా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆ ఇద్దరిని తాళ్లతో బంధించి గోల్డ్‌తో ఉడాయించారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే?
unidentified people stole the gold in visakha