శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడలో రైల్వేస్టేషన్ మార్గంలో వెళ్తున్న తల్లీకుమార్తెలపై.. గుర్తతెలియని దుండగుడు దాడి చేసి దోపిడీకి పాల్పడ్డాడు. వారిపై విచక్షణా రహితంగా దాడి చేయడంతో తలపై, చేతులపై తీవ్రగాయాలయ్యాయి. జెండాపేట గ్రామానికి చెందిన తిప్పాన జగదాంబ(42) తన కుమార్తె యమున(20)తో కలసి పలాసలోని బంధువుల ఇంటికి బయలుదేరారు. బస్సు కోసం నౌపడా రైల్వేగేటు కూడలికి నడిచి వెళ్తున్న సమయంలో.. గుర్తతెలియని దుండగుడు వెనుక నుంచి వచ్చిన ఇనుప వస్తువుతో దాడి చేశాడు.
తల్లీకూతుళ్లపై గుర్తుతెలియని వ్యక్తి దాడి.. తల్లి పరిస్థితి విషమం - Unidentified person attacks mother and daughter
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడలో రైల్వేస్టేషన్ మార్గంలో వెళ్తున్న తల్లీకుమార్తెలపై.. గుర్తుతెలియని దుండగుడు విచక్షణా రహితంగా దాడి చేసి దోపిడీకి పాల్పడ్డాడు. తలపై, చేతులపై దాడి చేయడంతో వీరికి తీవ్ర గాయ్యాలయ్యాయి. స్థానికులు గుర్తించి వెంటనే టెక్కలిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి పరిస్థితి విషమం ఉందని వైద్యులు తెలిపారు.
Naupada Crime new
తీవ్ర గాయాలైన వీరిని అటుగా వస్తున్న యువకులు గుర్తించి ఆటోపై టెక్కలిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. జగదాంబ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న.. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి:అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి, భార్య పరిస్థితి విషమం