ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

నెల్లూరు జిల్లాలో దారుణం.. బాలికపై మేనమామ యాసిడ్​ దాడి

Unlce acid attack on daughter in law: మేనమామ అంటే.. తల్లిదండ్రుల తర్వాత పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన వాడు. భవిష్యత్​కు దారి చూపాల్సిన వాడు. కానీ కామం మత్తులో మేనకోడలిపైనే కన్నేశాడు. గత కొన్ని రోజులుగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇది ఎవరికీ చెప్పుకోలేక ఆమె కుమిలిపోయింది. దాంతో అతని ఆగడాలు ఎక్కువయ్యాయి. ఈరోజు అది శృతిమించి.. ఆమెపై యాసిడ్​ దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె గొంతు కోశాడు.

acid attack
acid attack

By

Published : Sep 5, 2022, 10:27 PM IST

Updated : Sep 6, 2022, 8:56 AM IST

Acid attack on Minor: నెల్లూరులో కామాంధుడు చెలరేగిపోయాడు. ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించటంతో నోట్లో, ముఖంపై యాసిడ్‌ పోసి.. ఆపై గొంతు కోసి పరారయ్యాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈ బాలిక నెల్లూరు నగరానికి సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కుటుంబ సభ్యులు సోమవారం సాయంత్రం పని మీద బయటకు వెళ్లారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉందని గుర్తించిన నాగరాజు అనే వ్యక్తి ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆందోళన చెందిన ఆమె పక్కనే ఉన్న వాష్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసుకునే ప్రయత్నం చేసింది. సదరు వ్యక్తి తలుపులు బలంగా తోసుకుని లోనికి వెళ్లాడు. అక్కడ మరోమారు అత్యాచారానికి ప్రయత్నించటంతో తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో నిందితుడు ఆమె నోట్లో, ముఖంపై యాసిడ్‌ పోశాడు. ఈ బాధ తట్టుకోలేక ఆమె పెద్దగా కేకలు వేయటంతో.. నిందితుడు కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. చుట్టుపక్కల ఇళ్లవారు వచ్చిచూడగా బాలిక రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వచ్చి బాధితురాలిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాలికపై యాసిడ్ దాడి చేసి, గొంతు కోసిన మేనమామ నాగరాజుని వెంకటాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాధితురాలికి మంత్రి, ఎస్పీ పరామర్శ

యాసిడ్‌ దాడిలో గాయపడిన బాధితురాలిని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఎస్పీ సీహెచ్‌ విజయరావు, వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సోమవారం రాత్రి పరామర్శించారు. ఘటనకు దారి తీసిన పరిణామాలను తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఘటన జరిగిన ప్రాంతంలో కొన్ని ఆధారాలు సేకరించామని చెప్పారు. తనపై దాడి చేసిన మేనమామ నాగరాజును వదలొద్దని బాలిక పోలీసులను వేడుకున్నట్లు తెలుస్తోంది. బాలిక 9వ తరగతి చదువుతోంది.

నెల్లూరు జిల్లాలో దారుణం..

ఇవీ చదవండి:

Last Updated : Sep 6, 2022, 8:56 AM IST

ABOUT THE AUTHOR

...view details