పర్యాటక వీసాతో ఉగాండా నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ లొకాంటో డేటింగ్ యాప్ ద్వారా వీరు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. లొకాంటో డేటింగ్ వెబ్సైట్లో వ్యభిచార నిర్వాహకుల వివరాలు సేకరించిన మానవ అక్రమ రవాణా నిరోధక బృందం, చైతన్యపురి పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. చైతన్యపురిలోని ఓ లాడ్జ్‌కు రావాల్సిందిగా నిర్వాహకురాలు సూచించడంతో.. సాధారణ దుస్తుల్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ముగ్గురు ఉగాండా యువతులు అక్కడికి రాగానే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి 22గ్రాముల మత్తుపదార్థాలు, 5 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీసా గడుపు తీరినా నగరంలోనే ఉంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలడంతో సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు.