Two youths killed in road accident in AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. తిరుపతి - అనంతపురం జాతీరహదారిపై భాకరాపేట కనుమ దారిలో కారు, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న నితీష్(27), అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో.. 108లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చందు (27), అనే యువకుడు సైతం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు అన్నమయ్య జిల్లా సుండుపల్లెకు చెందినవారిగా గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమా.. లేక కారు డ్రైవర్ తప్పిదమా.. అనే కోణంలో విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి - Two youths killed in road accident
Two youths killed in road accident: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల నిండు జీవితాన్ని బలిగొంది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొన్న ఘటనలో ఒక యువకుడు ఘటన ప్రదేశంలోనే మృతి చెందగా.. మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి