ACCIDENT: సత్తెనపల్లి - గుంటూరు ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని బొలేరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కంటిపూడి వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారిని అజయ్, మున్నాగా గుర్తించారు. మృతులు పేరేచర్ల, క్రోసూరు మండలాలకు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. మృతులు పేరేచర్లలో విద్యుత్ సామాగ్రి కొనుగోలు చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుని పరిశీలించారు.
ACCIDENT: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బొలెరో వాహనం.. ఇద్దరు మృతి..! - పల్నాడు జిల్లా తాజా వార్తలు
ACCIDENT: పల్నాడు జిల్లా కంటేపూడి నలంద కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తెనపల్లి - గుంటూరు ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని బొలేరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బొలెరో వాహనం