child died falling in sambar: సాంబార్ గిన్నెలో పడి చిన్నారి మృతి చెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విస్సన్నపేటలోని దళితవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. దళితవాడలోని ఓ ఇంట్లో పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. అప్పటి వరకు ఆ కుటుంబం, వారి బంధువులు ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. ఇంతలో ఓ రెండేళ్ల చిన్నారి భోజనాల వద్ద ఉన్న వేడి సాంబార్ గిన్నెలో పడిపోయింది.
సాంబార్ గిన్నెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి.. - krishna district crime news
child died falling in sambar: వేడిగా ఉన్న సాంబారులో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలోని కలగర ఎస్సీవాడలో జరిగింది. ఆడుకుంటూ వెళ్లి అప్పుడే కాచిన సాంబారు పాత్రలో పడిపోయి కన్నుమూసింది. విగతజీవిగా మారిన చిన్నారిని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు.
child died falling in sambar
దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. అప్పటి వరకూ ఆడుకున్న చిన్నారి.. అంతలోనే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు.
ఇదీ చదవండి:ఉపాధ్యాయుడి కీచక పర్వం..వెలుగులోకి ఆడియో.. పోక్సో కేసు నమోదు