తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో రెండు టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని వేట్లపాలెంలో అక్రమంగా నిల్వ ఉంచి.. అమ్మకాలు చేస్తున్నారనే సమాచారంతో సామర్లకోట ఎస్సై అభిమన్యు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. బియ్యం బస్తాలను సీజ్ చేసిన పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. అతి తక్కువ ధరకు ప్రభుత్వం అందించే బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
PDS RICE: రెండు టన్నుల పీడీఎస్ బియ్యం స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్ - samarlakota si news
అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచి తక్కువ ధరకు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండల పోలీసులు పట్టుకున్నారు. రెండు టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
PDS RICE