Two students drowned in Munneru river: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మున్నేరు నీటిలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర మండలం మడుపల్లి గ్రామంలోని సరస్వతీ విద్యాలయానికి చెందిన సుమారు 80 మంది విద్యార్థులు శనివారం పెనుగంచిప్రోలు మున్నేరు ఒడ్డున ఉన్న మామిడి తోటలోకి పిక్నిక్ కోసం వచ్చారు. ఉదయాన్నే వచ్చిన విద్యార్థులు, వారితో వచ్చిన ఉపాధ్యాయులు ఆటపాటలతో సరదాగా గడిపారు.
పిక్నిక్ వెళ్లిన విద్యార్థులు.. మున్నేరులో మునిగి ఇద్దరు మృతి... - మున్నేరులో మునిగి మృతి
2students Dead at Munneru: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర మండలం మడుపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు పెనుగంచిప్రోలు మున్నేరులో మునిగి మృత్యువాత పడ్డారు. మడుపల్లి గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన 80 మంది విద్యార్థులు పెనుగంచిప్రోలు మామిడి తోటలోకి పిక్నిక్ వచ్చారు. సరదాగా నీటిలో దిగిన నలుగురు విద్యార్థుల్లో ఇద్దరు నీటిలో మునిగిపోయారు. మరో ఇద్దరిని ఉపాధ్యాయులు గమనించి రక్షించారు.
సాయంత్రం నాలుగున్నర సమయంలో నలుగురు విద్యార్థులు స్నానం చేసేందుకు మున్నేరులోకి దిగారు. వారిలో ఆరో తరగతి విద్యార్థి శీలం నర్సిరెడ్డి(12), నాలుగో తరగతి విద్యార్థి నీలం జస్వంత్ (10) నీటిలో మునిగి గల్లంతయ్యారు. ఈ విషయాన్ని గమనించిన ఉపాధ్యాయులు నీటిలో మునిగిన మరో ఇద్దరిని అతి కష్టం మీద బయటకు తీశారు. మిగిలిన ఇద్దరు మృతి చెందారు. దగ్గర్లో చేపలు పడుతున్న జాలర్లు వచ్చి మృదేహాలను బయటకు తీశారు. విషాద వార్త మడుపల్లి వాసులకు తెలియడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతిలోనయ్యారు. విషయం తెలుసుకున్న జగ్గయ్యపేట సీఐ, ఎస్ఐ, తహసీల్దార్ ఘటనా స్థలానికి వచ్చి వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: