ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు.. ఇద్దరు మృతి - latest crime news andhra pradesh

students died: మహాశివరాత్రి రోజున సముద్ర స్నానానికి వెళ్లి, ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటనలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

students died
ముగ్గురు విద్యార్థులు గల్లంతు

By

Published : Mar 2, 2022, 6:03 PM IST

students died: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా విశాఖలో వేర్వేరు ప్రాంతాల్లో సముద్ర స్నానానికి వెళ్లి, ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు మృతి చెందగా.. ఒకరు ప్రాణాలతో బయట పడ్డారు.

ఈస్ట్ పాయింట్ కాలనీకి చెందిన కె.రోహిత్ (16), పెద్ద జాలరి పేటకు చెందిన జె.సింహాద్రి (15 ) ప్రాణాలు కోల్పోయారు. పవన్ (15) అనే మరో విద్యార్థి సముద్రంలో స్నానానికి దిగి కొట్టుకుపోతుండగా, స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లు అతడిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు.

రోహిత్, సింహాద్రి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్​కు తరలించారు. ప్రాణాలతో బయటపడ్డ పవన్​ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎంవీపీ పోలీస్ స్టేషన్ సీఐ రమణయ్య కేసు నమోదు చేశారు. ఆయన నేతృత్వంలోని సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:AP CRIME NEWS: దిండుతో భార్యను హతమార్చిన భర్త.. కారణమిదే..

ABOUT THE AUTHOR

...view details