పంట రక్షణకోసం పొలంలో ఏర్పాటు చేసిన కరెంటుతీగలు.. గొర్రెల కాపరుల పాలిట యమపాశంగా మారింది. పందులు రాకుండా వేరుశనగ పొలం చుట్టూ పెట్టిన కరెంటు తీగలు తగిలి.. విద్యుదాఘాతంతో ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందారు. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం నంగనూరుపల్లెలో జరిగింది. గ్రామానికి చెందిన రామలక్ష్మమ్మ, దస్తగిరిలకు గొర్రెలు ఉన్నాయి.
Short-circuit: విద్యుదాఘాతంతో ఇద్దరు గొర్రెల కాపరులు మృతి
17:04 August 28
పొలానికి రక్షణగా కరెంటుతీగలు పెట్టిన యజమాని
ప్రతి రోజూ వాటిని మేపేందుకు అడవిలోకి తీసుకెళ్తుంటారు. రోజులాగే ఇవాళా గొర్రెలు మేపేందుకు వెళ్లిన ఆ ఇద్దరు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. ప్రమాదంలో నాలుగు గొర్రెలు, శునకం కూడా చనిపోయాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఇదీ చదవండి:
BABY MISSING: మార్కాపురం జిల్లా వైద్యశాలలో పసికందు అదృశ్యం
Accident: ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. నిద్రలోనే తండ్రి, కుమారుడు మృతి