తెలంగాణలో ఆదివారం జరిగినరోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా ఆదోనికి చేసిన ఆరెస్సై జిలానీ తో పాటు, హెడ్ కానిస్టేబుల్ సురేశ్ మృతు చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోరాంపల్లి బంజారాలో ఈ ఘటన చోటుచోసుకుంది. ద్విచక్రవాహనంపై పాల్వంచకు ప్రచారిస్తుండగా.. కంటైనర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
నేడు ఆదోని పట్టణంలో జిలానీ మృతదేహానికి ముస్లిం సంప్రదాయం ప్రకారం.. పోలీసు గౌరవంతో అంత్యక్రియలు జరిగాయి. మృతుడు జిలానీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ఏటపాక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు.