ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

SUICIDE: రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్య.. అదే కారణమా..? - గుంటూరు జిల్లా తాజా వార్తలు

SUICIDE: చాలామంది అక్రమ సంబంధాల మోజులో పడి తనువులు చాలిస్తున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోకుండా చావే శరణ్యం అనుకొని లోకాలను వీడుతున్నారు. అటు కన్నవారికి, కట్టుకున్నవారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే గుంటూరు జిల్లాలో జరిగింది. వారి ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని స్థానికులు భావిస్తున్నారు.

SUICIDE
SUICIDE

By

Published : Jul 13, 2022, 1:34 PM IST

SUICIDE: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం.. బ్రాహ్మణకోడూరు గ్రామానికి చెందిన గోపిశెట్టి అనుపమ (30), కిరణ్ (31)లు ఆత్మహత్య చేసుకున్నారు. తెనాలి మండలం పినపాడు రైల్వే గేటు వద్ద రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఘటన జరిగి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.

వీరిద్దరూ గత కొన్నేళ్లుగా సహజీవనం సాగిస్తున్నారని.. అంతకుముందే వీరిద్దరికి వేరువేరుగా వివాహాలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నారనే సందేహాలు గ్రామస్థులు వ్యక్తపరుస్తున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. మృతదేహాలను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించనున్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details