ELECTRIC SHOCK IN KONASEEMA :అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని ఒక అపార్ట్మెంట్లో పని చేస్తున్న ఇద్దరు కార్మికులు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం తంపటపల్లికి చెందిన గుడ్డు వెంకట రమణ(35), టి.కే రాజాపురానికి చెందిన గుడబా అర్లెప్ప(50).. రావులపాలెంలోని సీఆర్సీ రోడ్లో నూతనంగా నిర్మిస్తున్న వసంత విహార్ అపార్ట్మెంట్లో తాపీ పని చేసేందుకు వచ్చారు. భవనంలో సిమెంట్ కప్ బోర్డుల నిర్మాణంలో భాగంగా.. వాటిని కటింగ్ మిషన్‌తో కట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యారు.
కోనసీమలో విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతి
DIED WITH ELECTRIC SHOCK: వారిద్దరూ జీవనోపాధి కోసం ఊరు కాని ఊరొచ్చారు. భవన నిర్మాణ పనులు చేస్తూ.. విద్యుత్‌షాక్‌కు గురై.. ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది.
ELECTRIC SHOCK
వెంకట రమణ ప్లగ్ స్పిచ్ఛాన్ చేయగానే వైరు కట్ అయిన చోట చూసుకోకుండా అర్లెప్ప పట్టుకున్నాడు. అది చూసిన వెంకటరమణ స్విచ్ఛాఫ్ చేయకుండా వచ్చి అతన్ని పట్టుకోవడంతో అతను కూడా షాక్‌కు గురయ్యాడు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంటి తెలిపారు.
ఇవీ చదవండి: