ACCIDENT : నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కమ్మపాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. బాపట్ల జిల్లా ఆరవపాలెంకు చెందిన దంపతులు సుబ్బానాయుడు, సుబ్బరామమ్మ.. కుమారుడు శోభన్ బాబులు కారులో తిరుపతికి వెళ్తుండగా.. కొడవలూరు మండలం కమ్మపాలెం వద్ద కారు పంక్చర్ అయ్యింది. దీంతో పంచరైన కారును పక్కన నిలిపి ఉంచారు. అప్పుడే తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు.. కారును వేగంగా ఢీ కొట్టడంతో.. దంపతులిద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన శోభన్ బాబును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు - దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం
ACCIDENT : నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న వారి కారు టైరు పంక్చర్ అయ్యింది. దాంతో కారును పక్కకు నిలపగా.. తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ACCIDENT