తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా భీంగల్ మార్కెట్లో కూరగాయల వ్యాన్ బీభత్సం సృష్టించింది. కూరగాయలు దింపిన తర్వాత డ్రైవింగ్ రాని బాలుడు వాహనాన్ని నడపడంతో ప్రమాదం చోటు చేసుకుంది. సాయంత్రం సమయంలో వేగంగా వచ్చిన వ్యాన్... రెండు కార్లను తప్పించి ఇద్దరిని ఢీకొట్టి ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది.
తెలంగాణ: కూరగాయల మార్కెట్లో వ్యాన్ బీభత్సం... ఇద్దరికి గాయాలు - తెలంగాణ వార్తలు
తెలంగాణలోని నిజామాబాద్ భీంగల్ కూరగాయల మార్కెట్లో వ్యాన్ బీభత్సం సృష్టించింది. బాలుడు వాహనాన్ని నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ బాలిక సహా మరో బాలుడికి గాయాలయ్యాయి. స్థానికంగా ఉన్న పలువురు మహిళలు ప్రాణాలతో బయటపడ్డారు.

కూరగాయల మార్కెట్లో వ్యాన్ బీభత్సం... ఇద్దరికి గాయాలు
కూరగాయల మార్కెట్లో వ్యాన్ బీభత్సం... ఇద్దరికి గాయాలు
ఈ ప్రమాదంలో ఓ బాలిక, మరో యువకుడు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగే సమయంలో స్థానికంగా ఉన్న పలువురు మహిళలు ప్రాణాలతో బయటపడ్డారు.
ఇదీ చదవండి:ఒకే అమ్మ కడుపున పుట్టినా.. ఆస్తి కోసం రక్తబంధాన్ని తెంచాడు!