కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలు తీసుకెళ్తున్న ఇద్దరు వ్యాపారులు మృతి చెందిన ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రామగుండం రాజీవ్ రహదారిపై మల్యాలపల్లి మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారు వ్యాపారులు కొత్త శ్రీనివాస్, కొత్త రాంబాబు అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు కారులో ఉన్న సంతోష్ కుమార్, సంతోష్‌లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఇద్దరు వ్యాపారులు తెలంగాణలోని వివిధ బంగారు దుకాణాలకు బంగారం విక్రయిస్తుంటారు. ప్రమాదం జరిగినప్పుడు వీరి వద్ద కోటి రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయి.
రూ.కోటి బంగారం తీసుకెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు వ్యాపారుల మృతి - telangana varthalu
కారు బోల్తా పడి ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లి వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు గుంటూరు వాసులుగా పోలీసులు గుర్తించారు.
![రూ.కోటి బంగారం తీసుకెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు వ్యాపారుల మృతి two-people](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10738635-881-10738635-1614058617433.jpg)
two-people
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు ఘటనా స్థలికి వచ్చిన గోదావరిఖని 108 సిబ్బంది బంగారు ఆభరణాలను గుర్తించి రామగుండం ఎస్‌ఐ శైలజకు అప్పగించారు. నిజాయితీగా బంగారు ఆభరణాలు అప్పగించిన 108 సిబ్బందిని పోలీసులు అభినందించారు.
ఇదీ చదవండి: ఎస్ఈసీకీ ప్రభుత్వం సరిగా సహకరించలేదు: హైకోర్టు
Last Updated : Feb 23, 2021, 11:11 AM IST