చిత్తూరు జిల్లా రేణిగుంటలోని లాడ్జిలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. వేర్వేరు గదుల్లో వెంకటేష్(35), అనిత(31) బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే రెండు రోజుల క్రితం వారు వేర్వేరుగా గదులు తీసుకున్నారు. పురుగుల మందు తాగి వెంకటేశ్ ఆత్మహత్య చేసుకోగా.. అనిత ఉరివేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న రేణిగుంట పోలీసులు.. మృతికి గల కారణాలు అన్వేషిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. సహజీవనం, వివాహేతర సంబంధం కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లాడ్జిలో ఇద్దరి ఆత్మహత్య.. అసలు కారణమేంటో..? - two people committed suicide at renigunta
చిత్తూరు జిల్లా రేణిగుంటలోని లాడ్జిలో ఇద్దరు వ్యక్తులు.. వేర్వేరు గదుల్లో ఆత్మహత్య చేసుకున్నారు. వెంకటేష్(35), అనిత(31) బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రేణిగుంటలోని లాడ్జిలో ఇద్దరు ఆత్మహత్య
వెంకటేశ్ 15 ఏళ్లుగా తిరుపతిలో నివాసముంటున్నాడు. అతని స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి. అనిత స్వస్థలం తిరుపతిలోని సత్యనారాయణపురం.
ఇదీ చదవండి: ఏప్రిల్ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం: సీఎం జగన్
Last Updated : Mar 16, 2021, 7:37 PM IST