ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

వారిద్దరూ ఆలయంలో చోరీ చేయబోయారు.. సరిగ్గా అప్పుడే..! - ఏపీ తాజా నేర వార్తలు

అనంతపురం జిల్లా ఉరవకొండలోని మల్లేశ్వర స్వామి ఆలయంలో ఇద్దరు దుండగులు చోరీకి యత్నించారు. అదే సమయంలో అర్చకులు రావడంతో.. తమ ద్విచక్రవాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

two-people-attempted-to-theft-at-uravakonda-malleshwara-swamy-temple
వారిద్దరూ ఆలయంలో చోరీ చేయబోయారు.. సరిగ్గా అప్పుడే..!

By

Published : Nov 14, 2021, 1:04 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండల కేంద్రంలోని పురాతన మల్లేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఉదయం ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి ప్రయత్నించారు. సరిగ్గా అదే సమయంలో అర్చకులు ఆలయంలోకి రావడంతో... వారిని తోసేసి దుండగులు పారిపోయారు. అయితే.. ఈ ఇద్దరు దొంగలు ఈనెల 10వ తేదీన ఆలయంలో రెక్కీ నిర్వహించారు. ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశ్యంతో.. సీసీ కెమెరాలు ఆఫ్ చేశారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

వారిద్దరూ ఆలయంలో చోరీ చేయబోయారు.. సరిగ్గా అప్పుడే..!

పథకం ప్రకారం ఈ రోజు ఉదయం చోరీకి యత్నించి విఫలమయ్యారు. ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో తమ వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పారిపోయారు. అర్చకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితుల ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:POLLING START: ప్రశాంతంగా సాగుతున్న.. స్థానిక ఎన్నికల పోలింగ్

ABOUT THE AUTHOR

...view details