ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

GIRLS MISSING: అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిన అక్కాచెల్లెలు.. ఎంతసేపటికి రాకపోవడంతో...! - ap latest girls missing case

అర్ధరాత్రి 11 గంటల సమయంలో బయటకొచ్చిన ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. బాలికలిద్దరూ సొంత అక్కాచెల్లెల్లు. ఈ ఘటన గుంటూరు జిల్లా భట్టిప్రోలులో జరిగింది. బాలికల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

two-minor-girls-missing-in-bhattiprolu-at-guntur-district
అర్ధరాత్రి అక్కాచెల్లెల్ల అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి!

By

Published : Sep 15, 2021, 9:12 AM IST

గుంటూరు జిల్లా భట్టిప్రోలు గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు అదృశ్యమవడంపై పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. ఒకే కుటుంబానికి చెందిన 14, 16 సంవత్సరాల వయస్సు గల అక్కాచెల్లెళ్ళు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఎంతసేపటికీ రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో... గ్రామస్థుల సాయం తీసుకొని రాత్రంతా వెతుకుతూ.. తెలిసిన వాళ్లకి ఫోన్​లు చేశారు.

ఏం చేసినా లాభం లేకపోయేసరికి మంగళవారం ఉదయం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ శ్యామల రాజీవ్ కుమార్ తెలిపారు. అదృశ్యమైన బాలికల్లో ఒకరు ఇంటర్, మరొకరు 9వ తరగతి చదువుతున్నారు.

ఇదీ చూడండి:EAPCET: వ్యవసాయ కోర్సుల్లో 92.85% ఉత్తీర్ణత

ABOUT THE AUTHOR

...view details