children died in Accident: ఊహించని మృత్యువు ఆ కుటుంబాన్ని చిదిమేసింది. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను కారు పొట్టన పెట్టుకున్న ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. పెబ్బేరు మండలం శాగాపురానికి చెందిన శివకుమార్.. భార్య, పిల్లలతో కలిసి తన సోదరి ఊళ్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి వస్తున్నారు. ఉదయం వారిని తీసుకుని ద్విచక్రవాహనంపై బయలుదేరారు. కొంతదూరం వచ్చాక పెట్రోల్ అయిపోవటంతో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు.
పిల్లల్ని బైక్‌పై కూర్చోబెట్టి వెళ్లాడు.. కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది! - పిల్లల్ని బైక్‌పై కూర్చొబెట్టి వెళ్లాడు.. కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు
children died in Accident: తెలంగాణలో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను బైక్‌పై ఉంచి తండ్రి పెట్రోల్ కోసం వెళ్లాడు. అదే సమయంలో ఓ కారు టైరు పేలి బైక్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందారు.
పిల్లలను వాహనంపై కూర్చోబెట్టిన శివకుమార్.. పెట్రోల్‌బంక్‌కు నడుచుకుంటూ వెళ్లారు. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వేగంగా వెళ్తున్న కారు టైరు పగిలిపోయింది. అదుపుతప్పిన కారు... రోడ్డుపక్కన బైక్‌పై కూర్చున్న శివకుమార్ పిల్లలు హిమాన్స్ తేజ, ఆరాధ్యపైకి దూసుకెళ్లింది. గాల్లో ఎగిరిపడ్డ చిన్నారులు.. తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. తల్లీ మరో చిన్నారి దూరంగా నిలబడి ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. చిన్నారుల మృతదేహాల వద్ద తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్న తీరు.. అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.