ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

CCTV FOOTAGE: బైక్​ను ఢీ కొట్టిన కారు.. గాల్లోకి ఎగిరి పడ్డారు! - two injured when a car hits a bike

ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచమర్రి వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్​పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

బైక్​ను ఢీకొట్టిన కారు
బైక్​ను ఢీకొట్టిన కారు

By

Published : Aug 9, 2021, 6:34 PM IST

బైక్​ను ఢీకొట్టిన కారు.. గాల్లోకి ఎగిరి పడ్డారు!

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాచారెడ్డి మండలం పాల్వంచ మర్రి వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారిని.. ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్​పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం గజసింగవరం గ్రామానికి చెందిన అల్లెపు రాము(36) ద్విచక్రవాహనంపై కామారెడ్డి వైపు వెళ్తుండగా.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చింతల్ గ్రామం వద్ద హల్వాల మణెవ్వ(35) రామును లిఫ్ట్ అడిగారు. రాము లిఫ్ట్ ఇవ్వగా.. ద్విచక్రవాహనంపై ఇద్దరు బయలుదేరారు. మార్గమధ్యలో పాల్వంచమర్రి వద్దకు రాగానే..ఎదురుగా వస్తున్న కారు.. వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బైక్​పై నుంచి ఇద్దరు ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details