ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Harassment: మేనమామ వేధింపులు.. తల్లి సహకారం.. తట్టుకోలేక వాళ్లు ఏం చేశారంటే? - guntur crime news

Harassment: తండ్రి లేని వారికి ఆ ఇంటి పెద్ద కూతురే కొడుకుగా మారి కుటుంబ పోషణను తీసుకుంది. వారు కష్టాల్లో ఉంటే నేనున్నాను అంటూ భరోసా ఇవ్వాల్సిన మామ.. ఆ అమ్మాయిపై కన్నేశాడు. తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని తల్లితో చెపితే.. ఆమె కూడా అతను ఎలా చెప్తే అలా నడుచుకోమని కూతురికి సలహా ఇచ్చింది. ఎటూ దిక్కుతోచని స్థితిలో ఉన్నా చిన్నారులు తమకు రక్షణ కల్పించాలని అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

Harassment
మేనమామ వేధింపులు తాళలేక అర్బన్ ఎస్పీకీ ఫిర్యాదు

By

Published : Mar 23, 2022, 10:44 AM IST

Harassment: తండ్రి కోల్పోయిన పిల్లలను అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తల్లి, పెద్ద దిక్కుగా నిలవాల్సిన మేనమామ వేధిస్తున్నారని ఇద్దరు చిన్నారులు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గుంటూరు రామిరెడ్డితోటకు చెందిన బడే సాహెబ్ బంగారం మెరుగు పని చేస్తూ జీవనం సాగించేవాడు. అతనికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు. జనవరి 25న క్యాన్సర్ కారణంగా అతను మృతి చెందాడు. అప్పటినుంచి బడే సాహెబ్ పిల్లలు, అతని భార్య చిన్న బావమరిది వద్ద ఉంటున్నారు.

కుటుంబ పోషణ నిమిత్తం కాల్​సెంటర్​లో పనిచేస్తున్న పెద్ద అమ్మాయి పైన చిన్న మామయ్య కన్నువేశాడు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని తల్లికి చెప్పగా.. తప్పు అని చెప్పాల్సిన తల్లి కూడా మామయ్య చెప్పినట్లు నడుచుకో అని చెప్పింది. దాంతో విసుగు చెందిన ఆ పిల్లలు.. తన తల్లి, మామయ్య వేధింపులు తాళలేక అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమకి న్యాయం చేయాలని, వారి నుంచి రక్షించాలని ఎస్పీకి విన్నవించారు.

ABOUT THE AUTHOR

...view details