Accident: కృష్ణా జిల్లా గన్నవరం బస్టాండ్ సమీపంలో చెన్నై-కోల్కత్తా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వెళ్తున్న ట్రక్‌ని.. ఆయిల్ లారీ ఢీ కొట్టింది. దీంతో ట్రక్కులోని ఆయిల్ అంతా రోడ్డుపాలైంది. అయితే.. ఆయిల్‌ను గమనించకుండా శరవేగంగా వచ్చిన ఓ వాహనదారుడు.. లారీ కిందకు దూసుకెళ్లి మరణించాడు. అనంతరం.. అదే రీతిలో ఓ కారు అటువైపు రాగా.. ఆయిల్‌ను గమనించి డ్రైవర్ బ్రేక్ వేశాడు. దీంతో వెనకాలే ఉన్న మరో ద్విచక్రవాహనం కారును ఢీకొనటంతో.. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో మరణించిన వ్యక్తి పెద్దిరాజుగా గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
విజయవాడలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మృతి - కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు
Accident: కృష్ణా జిల్లాలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కృష్ణా జిల్లాలో రెండు వేర్వేరు చోట్లు రోడ్డు ప్రమాదాలు
కంచికచర్ల-విజయవాడ రహదారిపై నక్కలపేట క్రాస్ రోడ్డు వద్ద.. బుధవారం రాత్రి ఒంటిగంట సమయంలో ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో పులి నాగార్జున అనే వ్యక్తి మరణించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: