మెదక్ జిల్లా టేక్మాల్ మండలం దాదాయిపల్లిలో రెండు మృతదేహాలు(dead bodies found in pond) లభ్యం కావటం స్థానికంగా కలకలం రేపింది. దాదాయిపల్లి శివారులోని గచ్చుకుంటలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను గ్రామస్థులు గుర్తించారు.
dead bodies found in pond: కుంటలో మృతదేహాలు.. చంపిందెవరు? - ts top news
కుంటలో మృతదేహాలు.. చంపిందెవరు?
10:18 November 16
తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో ఘటన
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. నాలుగేళ్ల రిశ్వంత్, రెండేళ్ల రక్షిత చనిపోయినట్లుగా తేల్చారు. చిన్నారుల తల్లి కోటంగారి రంజిత కోసం గ్రామస్థులు గాలిస్తున్నారు. భర్తే హత్య చేసి కుంటలో పడేసినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి:
Last Updated : Nov 16, 2021, 11:34 AM IST