Two children died: తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని బ్రాహ్మణ బజారులో విషాదం చోటు చేసుకుంది. ఓ ఖాళీ స్థలంలో చిన్నారులు ఆడుకుంటుండగా భారీ వృక్షం కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
Two children died: విషాదం.. చెట్టు కూలి ఇద్దరు చిన్నారులు మృతి - ఖమ్మం జిల్లాకేంద్రంలో విషాదం
Two children died: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఆనందంగా క్రికెట్ ఆడుకుంటున్న చిన్నారులను ఓ చెట్టు చిదిమేసింది. గోడపై ఉన్న భారీ వృక్షం కూలిపోవడంతో ఇద్దరు బాలురు మృతి చెందగా నలుగురు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం ఆరుగురు చిన్నారులు బ్రాహ్మణ బజారులోని ఖాళీస్థలంలో ఆడుకునేందుకు వెళ్లారు. ఈక్రమంలో అక్కడున్న ఓ చెట్టు కూలి పక్కనున్న గోడపై పడింది. దీంతో గోడ కిందపడి దిగాంత్ శెట్టి (11), రాజ్‌పుత్ ఆయుష్ (6) మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు చిన్నారులు ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని మేయర్ నీరజ, ఏఈ నర్సయ్య, అగ్నిమాపక అధికారులు పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి:Gun firing in srikakulam: శ్రీకాకుళంలో కాల్పులు కలకలం.. రామచంద్రాపురం సర్పంచ్‌పై దుండగుల దాడి..