Accident: ముంజలు కొనడానికి వెళ్లి ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం - కారు ఢీకొని ఇద్దరు పిల్లలు మృతి
12:25 April 10
విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం గౌరీపురం వద్ద ఘటన
Accident: విజయనగరం జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, తండ్రి సోనాపతి మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శృంగవరపుకోట మండలం గౌరీపురం వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కన ముంజలు కొంటున్నవారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నారులు శ్రావణ్ (8), సుహాస్ (6), తండ్రి సోనాపతి( 35) మృతి చెందారు. వారి తల్లి శ్రావణి, పెద్దకన్నెపల్లికి చెందిన సుషిత్ (8) పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ ఆస్పత్రికి తరలించారు. మృతులు అల్లూరి జిల్లా అనంతగిరి మండలం కోనాపురం వాసులుగా సమాచారం. సోనాపతి అనంతగిరి మండలం శివలింగపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో వార్డెన్ గా పనిచేస్తున్నాడు.
ఇదీ చదవండి: Student Died: ఉన్నత చదువు కోసం వెళ్లి.. అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి