DIED: నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాదకర ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. ఇంకొల్లు మండలం సూదివారిపాలెం ఎస్టీ కాలనీకి చెందిన పాలపర్తి ప్రతాప్(7), పాలపర్తి శివరాజు (9) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. రోజు మాదిరిగానే పాఠశాలకు వెళ్లి వచ్చి..నిన్న సాయంత్రం ఆడుకునేందుకు నాగండ్ల రోడ్డు వైపుకు వెళ్లారు. అక్కడ ఉన్న నీటి కుంటను చూసి ఈత కొట్టడానికి చెప్పి మునిగిపోయారు. అటుగా వెళుతున్న వారు గమనించి ఇరువురిని బయటకు తీసి ఇడుపులపాడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు తెలిపారు. చిన్నారులు మృతి చెందటంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి .ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాపట్లలో విషాదం.. నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
DIED: నీటి కుంటలు, బోరుబావులు అభంశుభం తెలియని చిన్నారులు పాలిట మృత్యుపాశాలవుతున్నాయి. ఆడుకోవడానికని, ఈతకొట్టడానికని వెళ్లిన వారిని విగతజీవులుగా మారుస్తున్నాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారులు.. మృతదేహాలుగా మారడంతో తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బాపట్ల జిల్లాలో జరిగింది. ఆడుకోవడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటికుంటలో పడి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
DIED