పేగు బంధం తెగిపోయింది. మానవత్వం మంట కలిసింది. ఏం జరిగిందో కానీ ఇద్దరు శిశువులను.. కనికరం లేకుండా చెత్తకుప్పలో పడేశారు. ఈ హృదయ విదారకమైన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని సత్యనారాయణ పేటలో ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు శిశువులను వంతెన కింద పడేశారు. ఒక శిశువు మృతదేహాన్ని కుక్కలు పీక్కుని తిన్నాయి. పుట్టిన వెంటనే చనిపోవడంతో అలా పడేశారో.. పుట్టగానే చెత్తలో పడేశారో తెలియడం లేదు.
చెత్తకుప్పలో ఇద్దరు శిశువుల మృతదేహాలు.. పీక్కు తిన్న కుక్కలు - గుంతకల్లు రైల్వే ట్రాక్‌పై శిశువులు మృతి
14:57 August 31
రైల్వే వంతెన కింద ఇద్దరు శిశువులు
అమ్మ ఒడిలోనో, నాన్న గుండెలపైనో హాయిగా నిద్ర పోవాల్సిన ఈ శిశువులు.. మురుగు నీరు ప్రవహించే కాలువ పక్కన చెత్తలో విగతజీవులుగా పడి ఉండటం అందరినీ కలచివేసింది. చిన్నారుల మృత దేహాల వద్ద కుక్కలు గుమిగూడి ఉండటాన్ని.. స్థానికులు గమనించి మున్సిపాలిటీ అధికారులకు తెలియజేశారు. ఉదయం నుంచి శిశువుల అవశేషాలు అక్కడే ఉన్నా మున్సిపాలిటీ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని అక్కడి వాళ్లు ఆగ్రహించారు. అప్పటికే ఒక శిశువును కుక్కలు పీక్కు తినడంతో కొన్ని భాగాలు మాత్రమే మిగిలాయి. చివరికి ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది తీసుకువెళ్లి చిన్నారుల మృతదేహాలను ఖననం చేశారు.
ఇదీ చదవండి:
Minister Gowtham Reddy: రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదు: మంత్రి గౌతంరెడ్డి