ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Dead bodies: రామాపురం వద్ద సముద్రంలో కొట్టుకొచ్చిన ఇద్దరి మృతదేహలు - ramapuram beach news

dead bodies at ramapuram beach
dead bodies at ramapuram beach

By

Published : Feb 19, 2022, 8:39 AM IST

Updated : Feb 19, 2022, 11:31 AM IST

08:37 February 19

వాడరేవు వద్ద నిన్న సముద్రస్నానం చేస్తూ ఇద్దరు విద్యార్థులు గల్లంతు

ప్రకాశం జిల్లా రామాపురం వద్ద సముద్రంలో ఇద్దరి మృతదేహాలు కొట్టుకొచ్చాయి. మృతులు వెంకట మారుతి(18), ఆఫ్రిది(18)గా పోలీసులు గుర్తించారు. వాడరేవు వద్ద శుక్రవారం రోజు సముద్ర స్నానం చేస్తూ ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. శనివారం ఉదయం రామాపురం వద్ద సముద్రతీరానికి వారి మృతదేహాలు కొట్టుకొచ్చాయి.

అసలేం జరిగిందంటే...

స్నేహితులతో కలిసి సరదగా గడిపేందుకు వెళ్లిన విద్యార్థుల్లో ఇద్దరు ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవులో గల్లంతయ్యారు. వేటపాలెం బండ్ల బాపయ్య కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్దులు షేక్ ఆఫ్రిది, వెంకట మారుతి మరో నలుగురు స్నేహితులతో ఎన్​సీసీ సర్టిఫికెట్స్ కోసం చీరాల లోని వీఆర్ఎస్ & వైఅర్ఎన్ కళాశాలకు వెళ్లారు. సముద్ర తీరంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా ఉద్ధృతంగా వచ్చిన ఆలల తాకిడికి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరిని అక్కడే ఉన్న ఓ ఫొటోగ్రాఫర్ కాపాడగా, షేక్ ఆఫ్రిది(18)కె.వెంకట మారుతి(18)విద్యార్థులు గల్లంతయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు... గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం రామాపురం వద్ద సముద్రతీరానికి వారి మృతదేహలు కొట్టుకొచ్చాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ చదవండి:

Students Missing: సముద్రంలో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు

Last Updated : Feb 19, 2022, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details