ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

గెలుపు సంబురాలు.. గాల్లోకి కాల్పులు జరిపేందుకు యత్నించిన తెరాస నేత - హైదరాబాద్​ తాజా వార్తలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయం సాధించంటంతో ఆ పార్టీ నాయకులు హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​ వద్ద సంబురాలు జరుపుకున్నారు. తెరాస నాయ‌కుడు క‌ట్టెల శ్రీ‌నివాస్‌ యాద‌వ్ తుపాకీ తీయ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

తెరాస నాయ‌కుడు క‌ట్టెల శ్రీ‌నివాస్‌ యాద‌వ్
తెరాస నాయ‌కుడు క‌ట్టెల శ్రీ‌నివాస్‌ యాద‌వ్

By

Published : Mar 21, 2021, 5:50 PM IST

తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్ద శ‌నివారం నిర్వ‌హించిన సంబు‌రాల్లో తెరాస నాయ‌కుడు క‌ట్టెల శ్రీ‌నివాస్‌యాద‌వ్ తుపాకీతో రావడం కలకలం రేపింది. ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత కార్యకర్తలు, నాయకులు తెలంగాణ భవన్​కు చేరుకున్నారు. విజయోత్సాహంలో మునిగిపోయారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన కట్టెల శ్రీనివాస్ యాదవ్ తుపాకీ తీసి హల్​చల్ చేశారు.

జేబులోంచి తుపాకీ తీసి గాలిలోకి కాల్చేందుకు ప్ర‌య‌త్నించారు. అదే స‌మ‌యంలో ప‌క్క‌నున్న వారు వ‌ద్ద‌ని వారించిన‌ట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్​గా మారింది. ఈ ఘ‌ట‌న‌పై బంజారాహిల్స్ పోలీసులు దృష్టి సారించారు. ఇందుకు సంబంధించిన ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details